జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యి ప్రస్తుతం హీరో అవతరమెత్తి, ఈటీవీలో ఫ్యామిలీ స్టార్ ప్రోగ్రాం కి యాంకర్ గా చేస్తున్న సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ లో రష్మీ తో రొమాన్స్ చేస్తూ బాగా హైలెట్ అయ్యాడు. ఒక విధంగా సుధీర్ అంతగా ఫేమస్ అవ్వడానికి రష్మీ జోడి అనే చెప్పాలి. ఆమెతో లవ్ ట్రాక్ సుధీర్ ని బాగా ఫేమస్ చేసింది.
హీరోగా ఎదిగేందుకు కష్టపడుతున్న సుధీర్ రష్మీ ని పెళ్ళి చేసుకుంటాడని ప్రచారం జరిగినా అది జస్ట్ ఆన్ స్క్రీన్ జోడీనే, మా మధ్యన ఫ్రెండ్ షిప్ తప్ప ప్రేమ లేదు అని ఇద్దరూ చెప్పేసారు. కానీ సుధీర్, రష్మీ ఇద్దరిలో ఎవరూ వివాహం చేసుకోకుండా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు.
తాజాగా ధనరాజ్ వైఫ్ శిరీష సుధీర్ పెళ్లి చేసుకోడు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ తో తనకు మంచి పరిచయముంది, నన్ను వదిన అని అంటాడు అనగా యాంకర్ మరి సుధీర్ పెళ్లెప్పుడు చేస్తున్నారు అని అడిగాడు, దానికి ధనరాజ్ వైఫ్ సుధీర్ కి ఒక్క చోట స్ట్రక్ అవడం నచ్చదు, ఇప్పటివరకు సుధీర్ కి పెళ్లి బంధంలోకి వెళ్లాలనే ఆలోచన లేదు, ఇకపై చేసుకుంటాడేమో మాత్రం చెప్పలేము.
ఇప్పటివరకు అయితే సుధీర్ కి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ ధనరాజ్ వైఫ్ శిరీష ఆ ఇంటర్వ్యూలో సుధీర్ పెళ్లి పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.