రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తో డిజాస్టర్ అందుకుని పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్.. పవన్ డేట్స్ ఇచ్చేలోపు మరో హీరో కోసం వెతుకుతున్నారు. హరీష్ శంకర్ రామ్ తో చెయ్యాల్సిన మూవీ ఆగిపోయింది, వెంకటేష్ తో హరీష్ శంకర్ మూవీ ఉండొచ్చు అనే టాక్ నడుస్తున్న సమయంలో..
తాజాగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ పై కొన్ని విషయాలు పంచుకున్నారు. తనకు పిల్లలు లేరని, తాను, తన భార్య స్నిగ్ధ అసలు లైఫ్ లో పిల్లలు వద్దనుకున్నామని చెప్పి దానికి గల కారణాలేమిటో కూడా హరీష్ శంకర్ రివీల్ చేసారు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన చెల్లెలికి పెళ్లి చేయాలి, తమ్ముడిని సెటిల్ చేయాలి ఇలా ఎన్నో బాధ్యతలు మొయ్యాల్సి వచ్చేది.
ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంలో తన భార్య తనకు ఎంతో సహకారం అందించిందని, ఆ బాధ్యతలతోనే తాను పూర్తిగా అలిసిపోయానని, అందుకే అలాంటి బాధ్యతలు వద్దనుకున్నామని, ఆ కారణంగానే పిల్లలు వద్దనుకున్నట్లుగా చెప్పారు హరీష్ శంకర్.