నందమూరి నటసింహ బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ చేసినప్పుడు ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపించగా ఆయన భార్య బసవతారకం గా బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించారు. ఆచిత్రంలో బాలయ్య-విద్యా బాలన్ పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ అవ్వబోతుంది అంటున్నారు.
డాకు మహారాజ్ హిట్ తర్వాత బాలకృష్ణ తన హ్యాట్రిక్ డైరెక్టర్ బోయపాటి తో అఖండ 2 మొదలు పెట్టారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ ఓ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్నారు. మరో హీరోయిన్ గా విద్యా బాలన్ పేరు వినబడుతుంది.
అఖండ తాండవం చిత్రంలో బాలయ్య-విద్యా బాలన్ కాంబో మరోసారి రిపీట్ అవ్వబోతుంది అంటున్నారు. త్వరలోనే విద్యా బాలన్ అఖండ 2 సెట్ లోకి ఎంటర్ అవుతారని అంటున్నారు.