విజయ్ దేవరకొండ-రష్మిక ఇద్దరూ ఫ్రెండ్స్ ఆ లేదా లావర్సా, ఈ అనుమానం ఎప్పటినుంచో ఉన్నా విజయ్-రష్మిక మాత్రం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది మా మధ్యన ఎలాంటి ప్రేమ లేదు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే జంట డేటింగ్ చేస్తుంది అనేలా లంచ్ కి, అలాగే పార్టీలకు, వెకేషన్స్ కి కలిసి తిరుగుతారు.
ఈరోజు ఉగాది, రంజాన్ స్పెషల్ గా రష్మిక నటించిన సికందర్ రిలీజ్ అయ్యింది. ఇదే రోజు రష్మిక-విజయ్ దేవరకొండ ముంబైలో లంచ్ డేట్ లో మీట్ అవడంతో చూసి భలే దొరికారు రా రష్మిక-విజయ్ దేవరకొండ అంటూ కామెంట్ చేస్తున్నారు. రష్మిక మాస్క్ వేసుకుని కనిపించినా ఆతర్వాత మాస్క్ తీసి ఫోటో గ్రాఫర్స్ కి అభివాదం చేసింది.
ఆతర్వాత విజయ్ దేవరకొండ మరొపక్కగా మాస్క్ పెట్టుకుని రష్మిక ఉన్న ప్లేసుకి వెళ్ళాడు, ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. విజయ్-రష్మిక ముంబై లంచ్ డేట్ మాత్రం నెట్టింట సంచలంగా మారింది.