పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం స్పిరిట్ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నాడు. అతని డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తుండటం విశేషం. ప్రభాస్ లాంటి మాస్ అప్పీల్ ఉన్న హీరోకి సందీప్ లాంటి వైలెంట్ మేకర్ జత కడితే ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇది వరకు ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. సినిమా ఎప్పుడు మొదలవుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలకమైన అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ప్రస్తుతం తాను చిత్రానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్ మెక్సికోలో ప్రారంభం కానుందని హింట్ ఇచ్చాడు.
ఈ సమాచారం బయటకు రాగానే ప్రభాస్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటి వరకూ ఊహాగానాలే వినిపించినా.. ఇప్పుడు దర్శకుడి నుండి స్వయంగా వచ్చిన ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా స్పష్టత వచ్చింది. సినిమా ప్రారంభం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.