బాలీవుడ్ బ్యుటి జాన్వీ కపూర్ గ్లామర్ గురించి ప్రతిసారి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి ఆమె గ్లామర్ గురించి తెలియడమే కాదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే జాన్వీ అందాలు కోకొల్లలు.
తాజాగా జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్ చేస్తూ చేసిన గ్లామర్ రచ్చ మాములుగా లేదు. లాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్ హీట్ పుట్టించింది. వేసుకున్న కోటు విసిరేసి గ్లామర్ షో చేస్తూ ర్యాంప్ పై జాన్వీ కపూర్ వాక్ చేస్తూ రెచ్చిపోయింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తుల్లో జాన్వీ కపూర్ మెరిసిపోయింది.
మొదటిసారి రాహుల్ మిశ్రా డిజైనర్ దుస్తుల్లో జాన్వీ కపూర్ కనిపించి కనువిందు చేసింది. బంధాని బాడికాన్ డ్రెస్ లో జాన్వీ కపూర్ గ్లామర్ మాత్రం చూపరులకు మతిపోగొట్టేసింది. ఇప్పుడా ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.