నిజమే రష్మిక తెలివికి ఆమె అభిమానులు తెగ మురిసి పోతున్నారు. గ్రేట్ ఎస్కేప్ అంటూ రశ్మికను పొగడకుండా ఉండలేకపోతున్నారు. లేదంటే రష్మిక సక్సెస్ ల పరంపరకు బ్రేకులు పడేవి అనేది వారి ఆనందానికి అసలు కారణం. ఇంతకూ రశ్మికను ఆమె అభిమానులు అంతలా పొగడడానికి కారణం రాబిన్ హుడ్ నుంచి రష్మిక తప్పుకోవడమే.
నితిన్-వెంకీ కుడుముల, రష్మిక కలయికలో భీష్మ మంచి హిట్. అదే కాంబోలో మరో మూవీ ప్రకటన.. రష్మిక-నితిన్ తో వెంకీ కుడుముల రాబిన్ హుడ్ ని అనౌన్స్ చెయ్యగానే ఆ ప్రోజెక్టు పై అంచనాలు మొదలయ్యాయి. అప్పటికే రష్మిక హిందీలో విజయాలు సాధించడం మొదలు పెట్టేసింది. సో రష్మిక గ్లామర్, ఆమె విజయాలు రాబిన్ హుడ్ కి హెల్ప్ అవుతాయనుకున్నారు.
కట్ చేస్తే రష్మిక డేట్స్ అడ్జెస్ట్మెంట్ లేక రాబిన్ హుడ్ నుంచి తప్పుకుంది. ఆ ప్లేసులోకి శ్రీలీల వచ్చింది. రీసెంట్ గా విడుదలైన రాబిన్ హుడ్ టాక్, ఆ సినిమా కలెక్షన్స్ చూసాక డేట్స్ ఖాళీ లేవని రష్మిక లక్కీ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ అయ్యింది. లేదంటే శ్రీలీల ని ట్రోల్ చేసినట్టుగా రశ్మికను ట్రోల్ చేసేవారు అంటూ ఆమె అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.