కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక నటించిన సికందర్ రంజాన్ స్పెషల్ గా ఉగాది రోజున ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ సికందర్ విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకొచ్చే సరికే ఈ చిత్రం పైరసీ బారిన పడడం కలకలం సృష్టించింది.
మార్నింగ్ షో అయ్యాకో, లేదంటే సాయంత్రానికో సినిమా పైరసీ అయ్యింది అంటే అనుకోవచ్చు. కానీ సినిమా విడుదలవ్వక ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైతే దానిని ఏమనుకోవాలి. పైరసీ అనేది చిన్నా సినిమానా లేదంటే, పెద్దా సినిమానా అనేది తేడాలేకుండా అందరినీ భయపెడుతోంది.
దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించినా సికందర్ ఇలా విడుదలకు ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవడం దారుణాతిదారుణం అనే చెప్పాలి. అప్పటికి సికిందర్ టీమ్. పైరసీ లింక్ లు తీయిస్తున్నారు. అయినా చాలా చోట్ల స్ప్రెడ్ అయ్యిపోయింది. ఇది సల్మాన్ కు పెద్ద దెబ్బే.