సోషల్ మీడియా కే హీట్ తెప్పించే గ్లామర్ మాళవిక మోహనన్ సొంతం. సినిమాల పరంగా మాళవికకు ఎంత పేరొచ్చిందో తెలియదు కానీ ఆమె ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు యూత్ మొత్తం పిచ్చెక్కిపోతారు. అంతలాంటి గ్లామర్ షో చేస్తుంది మాళవిక మోహనన్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మాళవిక అందాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని వెయిట్ చేస్తుంటే అదేమో వెనక్కి పోతుంది. రాజా సాబ్ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వబోతుంది. దానితో టాలీవుడ్ ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
మాళవిక మాత్రం ప్రభాస్ గురించి చెబుతూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ప్రభాస్ తో వర్క్ చెయ్యడం ఇష్టం, ఆయన ఫుడ్ పంపిస్తే మా అమ్మ చేతి వంటలానే ఉంది అంటూ ప్రభాస్ ని పొగుడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మాళవిక మోహనన్ మతి పోగొట్టే ఫోటోలను షేర్ చేసింది. మతి కాదు మత్తెక్కిస్తోంది అంటారేమో మాళవిక మోహనన్ లేటెస్ట్ లుక్ చూస్తే.