పిఠాపురంలో వర్మను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ కి పొత్తులో భాగంగా టికెట్ కేటాయించాక వర్మకు చంద్రబాబు, లోకేష్ ల నుంచి హామీలు లభించాయి. దానితో వర్మ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడి పని చేశారు. పవన్ కూడా గెలిచాక వర్మకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇచ్చారు. కానీ వర్మకు చంద్రబాబు లోకేశులు రెండుసార్లు అన్యాయం చేసారు. ఎమ్యెల్సీగా వర్మ కు ఉన్నత స్థానం కట్టబెడతారనుకుంటే మళ్లీ నాగబాబు కోసం వర్మకు అన్యాయం చేసారు.
నాగబాబు కూడా తమ గెలుపుకి ఎవరి సహకారం లేదు, కష్టపడి గెలిచామంటూ వర్మను అవమానించినట్లుగా మాట్లాడారు. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న వర్మ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కు మంట పెట్టె పనిలో బిజీ అయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల ఎదుర్కుంటున్న సమస్యలను బహిర్గతం చేస్తున్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను తాను తీరుస్తానంటూ ఇంటింటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు పవన్ ను ప్రశ్నిస్తూ వర్మ ప్రశ్నల వర్షం సంధించారు. వర్మ అలా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడం, సమస్యల పరిష్కారానికి పోరాడారని చెప్పడం చూసిన వారు, వర్మ పవన్ కళ్యాణ్ వెనుక పొగపెట్టే పనిలో నిమగ్నమయ్యారంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.