హీరో సిద్దార్థ్ ని హీరోయిన్ అదితి రావు ప్రేమిచి మరీ రెండో వివాహం చేసుకుంది. గతంలో సిద్దార్థ్ కి, అదితి కి వేర్వేరు వివాహాలు అయ్యాయి. తమ తమ పార్ట్నర్స్ కి డివోర్స్ ఇచ్చేసి సిద్దు-అదితి లు డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు, గత ఏడాది సిద్దార్థ్-అదితి రావు లు తెలంగాణలోని వనపర్తిలో పురాతన ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
తాజాగా అదితి రావు సిద్దార్థ్ గురించి చెప్పి, అతన్ని ఎందుకు ప్రేమిచానో అనేది రివీల్ చేసింది. తన భర్త సిద్దార్థ్ చాలా సరదా మనిషి, అందరితో తొందరగా కలిసిపోతాడు, నాకు నా ఫ్యామిలీకి సిద్దు చాలా విలువనిస్తాడు, అతనిలోని ఆ లక్షణమే నాకు బాగా నచ్చింది. అందరితో కలిసి ఉండడం తనకు బాగా నచ్చుతుంది.
ఉమ్మడి ఫ్యామిలిలో పెరిగిన నాకు సిద్దులోని ఆ గుణమే బాగా నచ్చింది. సిద్దు తన చుట్టూ ఉన్న వాళ్ళను సంతోషంగా ఉంచాలనుకుంటున్నాడు. సిద్ధుతో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా ఓకె చెప్పేసాను అంటూ అదితి సిద్ధుతో ప్రేమ విషయాలు రివీల్ చేసింది.