స్పోర్ట్స్ స్టార్ల ను ఇండియన్ స్క్రీన్ పై చూపించాలనే కోరిక, వారు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే కాసులు కురుస్తాయనే ఆశతో దర్శకులు స్పోర్ట్స్ లో నెంబర్ 1 గా వెలుగిందే క్రీడా కారులను తీసుకొచ్చి, అత్యధిక పారితోషికాలు ముట్టజెప్పి సినిమాల్లో పాత్రలు రాసి మరీ నటింపజేస్తున్నారు. అలాగని ఆ పాత్రల్లో బలం ఉంది, ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయా అంటే లేదు అనే చెప్పాలి.
గతంలో పూరీ జగన్నాధ్ లైగర్ పాన్ ఇండియాలో ఫిలిం లో విజయ్ దేవరకొండ కోసం మైక్ టైసన్ ని తీసుకొచ్చారు. బాక్సర్ మైక్ టైసన్ ని తీసుకొస్తే పాన్ ఇండియాలో లైగర్ కు మైలేజ్ వస్తుంది అని ఆయనకు భారీగా పారితోషికం ఇచ్చి మరీ తెస్తే.. ఏమైంది, ఆ చిత్రంలో మైక్ టైసన్ రోల్ చూస్తే ఇలాంటి లెజెండ్ కి ఇలాంటి పాత్రా అన్నారు. ఆ చిత్రం భారీ డిజాస్టర్ అవడం టైసన్ అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసింది.
ఇక ఇప్పుడు క్రికెట్ లో తోపు అయిన డేవిడ్ వార్నర్ ను తీసుకొచ్చారు వెంకీ కుడుముల, నితిన్. రాబిన్ హుడ్ కోసం వార్నర్ ని దించారు. డేవిడ్ వార్నర్ ని ముందు పెట్టి రాబిన్ హుడ్ ని ప్రమోట్ చేసారు. కట్ చేస్తే రాబిన్ హూడ్ లో డేవిడ్ వార్నర్ పాత్ర క్లైమాక్స్ లో కనిపించి డిజప్పాయింట్ చేసారు.
డేవిడ్ వార్నర్ ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ రాబిన్ హుడ్ ని ఆదరిస్తారు అనుకుంటే థియేటర్లో వార్నర్ ని చూసినప్పుడు ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందన లేదంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లో టైసన్ ఇప్పుడు వార్నర్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోక పోగా.. విమర్శల పాలయ్యేలా చేసారు.