మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25 న గ్రాండ్ గా పాన్ ఇండియాలో రిలీజ్ అని ప్రకటించడమే కాదు, మంచు విష్ణు కన్నప్ప ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే పలు దేవాలయాలను సందర్శిస్తూ కన్నప్ప పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఔట్‌పుట్ కోసం మంచు విష్ణు తో సహా టీమ్ కష్టపడుతోంది.
తాజాగా మంచు విష్ణు కన్నప్ప పై చేసిన ప్రకటన మూవీ లవర్స్ ని డిజప్పాయింట్ చేసింది. కన్నప్ప సినిమా విడుదల ఆలస్యం అవుతుందని.. వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ట్వీట్ చేశారు.
కన్నప్ప సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. మూవీ యూనిట్ మంచి ఔట్‌పుట్ కోసం రేయింబవళ్లు కష్టపడుతోంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే సినిమా విడుదల తేదీ ఆలస్యం కానుంది. దీనికి మేం చింతిస్తున్నాం. మీ ఓపికకు, మద్దతుకు ధన్యవాదాలు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం అంటూ మంచు విష్ణు ప్రెస్ నోట్ వదిలారు.