మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. రామ్ చరణ్ బర్త్ డే పార్టీ ని ఆయన భార్య ఉపాసన చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. ఆ విషయం కాస్త లేట్ గా బయటపడింది. ఉపాసన చరణ్ బర్త్ డే ఫొటోస్ ని షేర్ చేసింది. ఈ వేడుకల్లో రామ్ చరణ్ ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీ కనిపించింది. అంతేకాదు అక్కినేని నాగార్జున కూడా చరణ్ బర్త్ డే లో ఉన్నారు.
కానీ రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు, అంత పెద్ద పార్టీలో అల్లు ఫ్యామిలీ పాల్గొనకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్ అంటే దుబాయ్ లో ఉన్నాడు. కానీ ఆయన భార్య, అల్లు అరవింద్ ఇక్కడే ఉన్నారు. ఉపాసన షేర్ చేసిన ఏ పిక్ లోను అల్లు ఫ్యామిలీ కనిపించకపోవడమే ఇప్పుడు అందరి అనుమానాలకు తావిచ్చింది
రామ్ చరణ్ బర్త్ డే ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నా అందరూ చరణ్ పుట్టిన రోజు వేడుకలో అల్లు ఫ్యామిలీ కనిపించకపోవడం పైనే మాట్లాడుకుంటున్నారు.