మొదటి సినిమా సమయంలో బావమరిది నార్నే నితిన కోసం ఎన్టీఆర్ మ్యాడ్ సినిమా ట్రైలర్ లాంచ్ చేసారు. బావమరిదికి అప్పుడు బావ ఎన్టీఆర్ సపోర్ట్ ఉంది. నువ్వు హీరో అవ్వాలనుకుంటే కష్టపడాలి, ఇక్కడ ఎవ్వరి సపోర్ట్ ఉండదు అని బావమరిదికి చెప్పిన ఎన్టీఆర్ మ్యాడ్ సినిమా సమయంలో ట్రైలర్ విడుదల సమయంలో సపోర్ట్ చేసారు.
కానీ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ నార్నె నితిన్ కి ఎలాంటి సపోర్ట్ చెయ్యలేదు. మ్యాడ్ స్క్వేర్ కి సంబందించిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కానీ ఎక్కడా ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండానే మ్యాడ్ స్క్వేర్ విడుదలయ్యింది, సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది. మొదటి రోజు బిగ్ ఓపెనింగ్ సాధించింది.
నాగవంశీ కూడా ఎన్టీఆర్ పరిచయాన్ని మ్యాడ్ స్క్వేర్ కోసం వాడలేదు, నార్నె నితిన్ కూడా బావ ఎన్టీఆర్ ని వాడుకోకుండానే హిట్ కొట్టాడు. మ్యాడ్ స్క్వేర్ కి ఎన్టీఆర్ సపోర్ట్ లేకపోతేనేమి.. ఈ వారం ఈ చిన్న సినిమానే కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేసేసింది.