మెగా హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ వరస సినిమాలతో బిజిగా కనబడుతున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినిమాలు సెట్స్ మీదున్నాయి, షూటింగ్స్ కి వెళుతున్నారు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం ఖాళీగా కనబడుతున్నాడు. మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తరవాత చేసిన సినిమాలు ఏవి మెప్పించలేకపోయాయి.
కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ చిత్రాలు వరస డిజాస్టర్స్ తో వైష్ణవ తేజ్ నెక్స్ట్ సినిమా విషయంలో ఏళ్ళ తరబడి ఆలోచిస్తున్నాడు, రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ చిత్రం కోసం ఏకంగా 100 కథలు విన్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరి 100 కథల్లో ఏ కథ కూడా వైష్ణవ్ తేజ్ ని మెప్పించలేదా, అసలు వైష్ణవ్ తేజ్ కి ఎలాంటి కథ కావాలి, యాక్షన్ కథా, లేదంటే లవ్ స్టోరీనా, కాదు డిఫ్రెంట్ స్టోరీస్ ఏమైనా ట్రై చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరి వైష్ణవ్ తేజ్ ఎలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందు వస్తాడో చూడాలి.