ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న శ్రీలీల కు 2023 లో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పడ్డాయి. యంగ్ హీరోల చిత్రాల్లో ఒకే తరహా పాత్ర చేసి విమర్శల పాలయ్యింది. ధమాకా తర్వాత ఆ రేంజ్ హిట్టు కోసం వెయిట్ చేస్తున్న శ్రీలీల కు పుష్ప 2 కిస్సిక్ సాంగ్ ఊపునిచ్చింది. పుష్ప 2 సాంగ్ తర్వాత శ్రీలీల కు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి.
అంతేకాదు తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పేసుకుంది. అందులో ముందుగా రష్మిక వదిలేసిన ప్రాజెక్టులోకి శ్రీలీల వచ్చింది. భీష్మ కాంబో నితిన్-వెంకీ కుడుముల ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ గా ఎనౌన్స్ చేసాక ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేసులోకి శ్రీలీల రావడం, ఆతర్వాత రవితేజ తో మాస్ జాతర ఒప్పుకోవడంతో శ్రీలీల ట్రాక్ లోకి వచ్చేసింది అన్నారు.
కానీ ఆమెకు నితిన్ రాబిన్ హుడ్ నిరాశపరిచే రిజల్ట్ నిచ్చింది. ఈ చిత్రంలో శ్రీలీల అందంగా గ్లామర్ గా కనిపించినా ఆమె పాత్రలో ప్రత్యేకత లేదు. కేవలం పాటల కోసమే శ్రీలీలను పెట్టుకున్నారా అని అనిపించకమానదు. అందులోను రాబిన్ హుడ్ కి యావరేజ్ టాక్ రావడంతో శ్రీలీల పేరు అస్సలు వినిపించకుండా పోయింది. అలా రాబిన్ హుడ్ తోనూ శ్రీలీల కు డిజప్పాయింట్ తప్పలేదు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.