ఉగాది స్పెషల్ గా ఈ శుక్రవారం విడుదలైన యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ మొదటి నుంచి మంచి అంచనాలతోనే కనిపించింది. డిఫరెంట్ ప్రమోషన్స్, నాగవంశీ కాన్ఫిడెన్స్, కుర్రాళ్ళు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ల హంగామాతో సినిమాపై ప్రేక్షకుల్లో ఏర్పడిన ఇంట్రస్ట్ ఫలితం మ్యాడ్ స్క్వేర్ కి భారీ ఓపెనింగ్స్ కట్టబెట్టారు ఆడియన్స్.
నితిన్ రాబిన్ హుడ్ తో పోటీపడిన మ్యాడ్ స్క్వేర్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుంచే 10 కోట్ల మేర గ్రాస్ ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో సహా యూఎస్ మార్కెట్ లో కూడా మ్యాడ్ స్క్వేర్ భారీ ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా తెలుస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రల మ్యాడ్ స్క్వేర్ మొదటి రోజు లెక్కలు
ఏరియా కలెక్షన్స్
నైజాం – 2.35 కోట్లు
సీడెడ్ – 0.74 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.62 కోట్లు
తూర్పు గోదావరి – 0.37 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.21 కోట్లు
కృష్ణ – 0.28 కోట్లు
గుంటూరు – 0.51 కోట్లు
నెల్లూరు – 0.19 కోట్లు