గత ఏడాది డిసెంబర్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల రీసెంట్ గానే వెకేషన్ కి వెళ్లొచ్చారు. ఆతర్వాత శోభిత తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. కుంభకోణం టెంపుల్ దగ్గర నుంచి అరుణాచలం గుడి వరకు శోభిత తిరిగొచ్చింది.
తాజాగా నాగ చైతన్య-శోభిత లు కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టారు. కొత్త అనలేం కానీ.. ఇంతకుముందే నాగ చైతన్య ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు భార్య శోభిత తో కలిసి షుజి పేరుతో తమ ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టినట్లు నాగ చైతన్య, శోభితలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ప్రపంచంలో ఉన్న అన్నిరకాల రుచులని ఒకేచోట అందించే లక్ష్యంతో షోయుని పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రయత్నానికి అభిమానుల ఆదరణ, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించడమే కాదు నాగ చైతన్య అక్కడ తయారవుతున్న వివిధ రకాల వంటకాల ఫోటోలను, కిచెన్ పిక్స్ ని షేర్ చేసాడు.