రామ్ చరణ్ బర్త్ డే రోజు దర్శకుడు బుచ్చిబాబు మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. పెద్దిగా రామ్ చరణ్ లుక్ ని టైటిల్ తో సహా రివీల్ చెయ్యగా.. పెద్ది లో రామ్ చరణ్ లుక్ పై ట్రోల్స్ కనిపించాయి. రామ్ చరణ్ మాస్ లుక్ ఎంతగా అట్రాక్ట్ చేస్తున్నా ఆ ట్రోల్స్ మెగా ఫ్యాన్స్ ని కాస్త ఇబ్బంది పెట్టాయి.
రామ్ చరణ్ బర్త్ డే కే RC 16 నుంచి టైటిల్ తో పాటుగా గ్లింప్స్ రాబోతున్నాయని అన్నప్పటికి.. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అస్వస్థత కారణంగా అది పోస్ట్ పోన్ అయ్యింది. కానీ రెండు రోజులకే పెద్ది గ్లింప్స్ ని రెడీ చేసేసారు బుచ్చి బాబు అండ్ టీమ్. రేపు ఉగాదికి RC 16 పెద్ది గింప్స్ వదిలేందుకు రంగం సిద్దమైంది.
20 సెకన్ల పాటు ఉండబోయే పెద్ది గ్లింప్స్ లో ఉత్తరాంధ్ర మాండలీకంలో రామ్ చరణ్ చెప్పే డైలాగులు హైలెట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ మాస్ కాదు కాదు రఫ్ అండ్ రగడ్ లుక్ లో చెప్పబోయే పవర్ ఫుల్ డైలాగ్స్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్. ఖచ్చితంగా రేపు ఆదివారం ఉగాదికి పెద్ది గ్లింప్స్ అయితే రావడం పక్కా అంటున్నారు.