ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బేబమ్మ గా బలమైన ముద్ర వేసిన కృతి శెట్టి ఆతర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. దానితో తమిళ, మలయాళం చిత్రాల్లో వచ్చిన అవకాశాలను అందుకుని బిజీగా కెరీర్ ప్లాన్ చేసుకుంది. పర భాషల్లోనూ కృతి శెట్టి కి అనుకున్న సక్సెస్ రాలేదు, స్టార్ ఛాన్స్ లు వస్తున్నా అమ్మడుకి విజయం ఆమడదూరాన ఉండిపోతుంది.
ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా వున్న కృతి శెట్టి ఈమధ్యన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది. గ్లామర్ ఫోటో షాట్స్ వదులుతూ తనలోని మరో యాంగిల్ ని చూపిస్తుంది. తాజాగా కోట్ ఉన్న మోడ్రెన్ డ్రెస్ లో కృతి శెట్టి గ్లామర్ గా సొగసులు చూపించింది.
ఎక్కువగా సాంప్రదాయంగా పద్దతిగా కనిపించే కృతి శెట్టి లోని ఈ గ్లామర్ యాంగిల్ చూసి టాలీవుడ్ దర్శకనిర్మాతలెవరైనా అమ్మడుకి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.