పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన గణం అండగా ఉండే యూత్ స్టార్ నితిన్ రాబిన్ హుడ్ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. అలాగే ఇప్పటివరకు అభిమానులు అస్సలు సీరియస్ గా తీసుకొని ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యింది. ఆ నితిన్ కి ఈ నితిన్ కి మధ్య పోటీ ఏర్పడింది, ఫలితం ఎలా ఉందంటే..
చాలా సెంటర్స్ లో రాబిన్ హుడ్ వెనకపడింది, ఏ సెంటర్ లోనైనా మ్యాడ్ స్క్వేర్ హౌస్ ఫుల్ బోర్డు పెట్టగలిగింది. మ్యాడ్ అనే సినిమా హిట్ అయ్యి ఉండొచ్చు, ఆ ఫ్రాంచైజీలో ఇది వచ్చి ఉండొచ్చు, మరీ ఇంతగా ఎట్రాక్ట్ చేసిందా యూత్ ని అనేలా ఓపెనింగ్స్ తోనే ప్రూవ్ అయ్యింది. అక్కడ నితిన్ ఉన్నా, శ్రీలీల పక్కనే జంటగా ఉన్నా, డేవిడ్ వార్నర్ లాంటి క్రికెట్ స్టార్ యాడ్ అయినా, ఎన్నో రీల్స్ చేసి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేద్దామని ప్రయత్నించినా రాబిన్ హుడ్ కు రావాల్సిన ఓపెనింగ్స్ దక్కలేదు, మ్యాడ్ స్క్వేర్ మాత్రం నిజంగా మ్యాజిక్ చేస్తోంది బాక్సాఫీసు దగ్గర.
ఈ వీకెండ్ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకోబోతుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు, దానికి నిదర్శనంగా నేటి ఓపెనింగ్స్ ని చూపిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన మంచి మౌత్ టాక్ వల్ల, పాజిటివ్ రివ్యూస్ వల్ల మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్లీ ఈ ఫ్రైడే విన్నర్ ఆ నితిన్ మిస్ అయ్యాడు, ఈ నితిన్ కొట్టేసాడు.