Advertisementt

దేవరకొండ తో కీర్తి సురేష్ రొమాన్స్

Fri 28th Mar 2025 04:37 PM
keerthy suresh  దేవరకొండ తో కీర్తి సురేష్ రొమాన్స్
Keerthy Suresh to Star with Vijay Devarakonda దేవరకొండ తో కీర్తి సురేష్ రొమాన్స్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ హీరోగా రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రెడీ జనార్దన సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం కీర్తీ సురేష్‌ను సంప్రదించారు. కథ నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. త్వరలోనే మిగతా వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ, కీర్తీ సురేష్ కలిసి మహానటిలో నటించిమా, కలిసి రొమాన్స్ మాత్రం ఇదే మొదటిసారి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి వీరి జోడీ సినీ ప్రేమికుల అంచనాలను అందుకుంటుందా..? లేదా అనేది చూడాల్సిందే.

Keerthy Suresh to Star with Vijay Devarakonda:

Keerthy Suresh to romance Vijay Devarakonda

Tags:   KEERTHY SURESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ