వల్లభనేని వంశీ కి షాకుల మీద షాకులిస్తుంది విజయవాడ SC, ST కోర్టు. గత నెలలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోను, అలాగే టీడీపీ ఆఫీస్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్స్ పదే పదే రిజెక్ట్ అవుతున్నాయి.
పలుమార్లు బెయిల్ కోసం వంశీ లాయర్ వేస్తున్న పిటిషన్ లను కోర్టు కొట్టేసి వంశీ కి రిమాండ్ పొడిగిస్తుంది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు అలాగే సత్యవర్షన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి మరోసారి కోర్టు షాకిచ్చింది. కిడ్నాప్ కేసులో ఏప్రిల్ 9 వరకు వల్లభనేని వంశీ కి రిమాండ్ పొడిగించింది కోర్టు.
రెండు రోజుల క్రితం వంశీ అనుచరుడు రంగా అరెస్ట్ కూడా వంశీ ని ఇబ్బందుల్లోకి నెట్టింది. కోర్టు వంశీకి ఎప్పుడు బెయిల్ మంజూరు చేస్తుందో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.