టీడీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైన కొలికపూడిని పార్టీ వదిలించుకోవడం బెస్ట్ అనే కామెంట్స్ టీడీపీ కార్యకర్తల నుంచి వినిపించడం గమనార్హం. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మీడియాలో హైలెట్ అయిన కొలికపూడి ని 2024 ఎన్నికల్లో తిరువూరు ఎమ్యెల్యే సీటు ఇచ్చి గెలిపించుకున్నప్పటి నుంచి కొలికపూడి తన సొంత పార్టీ పైనే రాళ్ళు విసరడం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
ఫస్ట్ టైమ్ ఎమ్యెల్యేగా ఎన్నికైన కొలికపూడి కామ్ గా పార్టీకి విధేయంగా ఉండాల్సింది పోయి ఎప్పుడు సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టే పనులు చేస్తున్నాడు. కొద్దిరోజుల ముందు రైతులను కుక్కలతో పోలుస్తూ వివాదాస్పదమైన కొలికపూడి ఇపుడు సొంత పార్టీ నేత రమేష్ రెడ్డి పై బహిరంగ ఆరోపణలు చెయ్యడం అధికార పక్షాన్ని సమస్యల్లోకి నెట్టేలా చేసింది.
టీడీపీ నేత రమేష్ రెడ్డి ఓ గిరిజన మహిళపై అసభ్యంగా ప్రవరించాడని తనకు పిర్యాదు వచ్చింది, రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే తను ఎమ్యెల్యే గా రాజీనామా చేస్తాను అంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చెయ్యడం చూసిన వారు ముందు కొలికపూడిని పార్టీ నుంచి సాగనంపండి, అప్పుడు కాని పార్టీకి అధిష్టానానికి మనశాంతి కలగదు, కొలికపూడి వలన పార్టీకి చెడ్డపేరు వస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.