గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నిన్న వచ్చిన RC 16 పెద్ది ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ లుక్ చూసి ఫ్యాన్స్ వావ్ అన్నారు. ఏదో పెద్దగానే ప్లాన్ చేసాడే దర్శకుడు అని క్రిటిక్స్ అన్నారు. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అస్వస్థత వల్ల గ్లింప్స్ కి BGM ఇవ్వలేకపోవడం వల్ల అది మిస్ అయ్యింది కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రం అంతో ఇంతో అభిమానులను సంతృప్తిపరిచాయి.
ఇదిలా ఉంటే ఓ వైపు మెగా ఫ్యాన్స్ వచ్చిందానితో సరిపెట్టుకున్నా, ఆ వచ్చిందాన్ని కూడా గిచ్చేలా ట్రోల్స్ స్టార్ట్ చేసాయి ఇతర ఫ్యాన్ వర్గాలు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కొత్తేమి కాదు, ఏ చిన్న సాకు దొరికిన ట్రోల్స్ తో, మీమ్స్ తో ఫ్యాన్ వార్స్ చేసుకోవడం ఈమధ్య మరీ కామన్ అయ్యిపోయింది. ఇక ఈ RC 16 పెద్ది ఫస్ట్ లుక్ పై వస్తోన్న విమర్శలు ఏమిటంటే..
పెద్ది పోస్టర్స్ లో రామ్ చరణ్ లుక్ దాదాపుగా కాదు కాదు ఆల్మోస్ట్ గా అల్లు అర్జున్ పుష్ప లుక్ ని పోలి ఉందని చాలా కామెంట్స్ వినబడుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ క్లోజప్ పోస్టర్ లో అయితే అతడు అచ్చంగా అల్లు అర్జున్ లానే అనిపించాడు అంటున్నారు నెటిజెన్లు. సుకుమార్ శిష్యుడే కదా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు. గురువుగారిని ఫాలో అవుతున్నాడో లేదా కాపీ కొడుతున్నాడో వేచి చూడాలి.
అయితే ఈ ప్రాజెక్ట్ మొత్తం సుకుమార్ కనుసన్నల్లోనే జరుగుతోంది కనక, రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోయేది సుకుమారే కనుక అభిమానులు ఆయనపై నమ్మకం ఉంచుకోవచ్చు, ఆందోళనని పక్కన పెట్టేసుకోవచ్చు.