సమంత ప్రస్తుతం వెకేషన్ లో సేద తీరుతుంది. శ్రీలంక నుంచి ట్రావెల్ చేస్తూ ఆమె ఇప్పుడు ఆస్ట్రేలియా లో తేలింది. అక్కడ సిడ్నీ లో సమంత యానిమల్స్ తో ఆడుకుంటూ ఛిల్ అవుతున్న ఫొటోస్ షేర్ చేసింది. జంతువులతో ఆడుకోవడం, సమయం గడపడం ఉత్సాహాన్నిస్తుంది, మంచి వైబ్స్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
కంగారు లతో సమయం గడుపుతూ సమంత ఫోటోలకు ఫోజులిచ్చింది. దానితో సిడ్నీ లో ఛిల్ వుంటున్న సమంతా అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక సమంత ఈమధ్యన ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.
రాజ్ తో సమంత డేటింగ్లో ఉంది అని ప్రచారం జరగడమే కాదు, సీక్రెట్ గా సమంత ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ప్రచారం పై సమంత ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.