మార్చ్ 28 అంటే రేపు శుక్రవారం ఉగాది స్పెషల్ గా విడుదలకానున్న మ్యాడ్ సీక్వెల్ గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి సంబందించిన ప్రీమియర్స్ పలు చోట్ల ప్రదర్శించడంతో.. ప్రేక్షకులు మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్స్ టాక్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ కాంబోలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార నాగవంశీ ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించారు.
విభిన్నమైన ప్రమోషన్స్ తో మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు పెంచగా దానిని మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ పదింతలు చేసింది. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే.. ఫస్ట్ హాఫ్ లడ్డుగాని పెళ్లి ఎపిసోడ్ ఫుల్ ఫన్ చేస్తే, సెకండ్ హాఫ్ మొత్తం సునీల్, సత్యం రాజేష్ ఆ ఫన్ కి డబుల్ డోస్ ఇచ్చారు. గోవా ఎపిసోడ్ మొత్తం కామెడీ డైలాగ్స్ తో నిండిపోవడం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
సంగీత్ శోభన్, విష్ణు తమ కామెడీతో మరోసారి పగలబడి నవ్వించారు, ఫైనల్ గా మ్యాడ్ స్క్వేర్ ప్రీమియర్ రిజల్ట్ ఏమిటంటే జోష్ ఫుల్ ఎంటర్టైనర్, నో లాజిక్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటూ ఆడియన్స్ ట్వీట్లు పెడుతున్నారు.