అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా మూవీ లాక్ అవ్వకముందు దర్శకుడు అట్లీ సల్మాన్ ఖాన్‌తో ఓ భారీ యాక్షన్ మూవీ చేయాలని భావించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పలు చర్చలు, వాయిదాల అనంతరం ఈ ప్రాజెక్ట్ రద్దయింది. దీనికి గల కారణాల గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా సికందర్ ప్రమోషన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ దీనిపై ఓపెన్ అయ్యాడు.
సల్మాన్ ఖాన్ చెప్పిన వివరాల ప్రకారం అట్లీ సిద్ధం చేసిన స్క్రిప్ట్ చాలా పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కించాల్సిన యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఆ స్థాయి ఖర్చు తాను వర్కౌట్ చేయలేనని భావించి ప్రాజెక్ట్‌ను వదులుకున్నానని పేర్కొన్నాడు. ఈ వివరణతో ఎంతో మందికి క్లారిటీ వచ్చింది. గతంలో వచ్చిన అనేక వార్తలకు ఈ వ్యాఖ్యలు సమాధానం ఇచ్చినట్లయ్యాయి.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, సల్మాన్ ఖాన్ మాటల ప్రకారం అట్లీ చెప్పిన కథలో రజనీకాంత్ లేక కమల్ హాసన్ నటించాలనే ఆలోచన ఉందా..? లేదా ఇప్పుడే అదే కథను అల్లు అర్జున్‌కు చెప్పి ఒప్పించాడా..? అనే అంశంపై భిన్నమైన వార్తలు వెలువడుతున్నాయి. ఇది పూర్తిగా కొత్త కథనా లేక రెగ్యులర్ మల్టీస్టారర్ ప్లాన్‌నా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.
కొద్ది రోజుల క్రితం అట్లీ ప్రాజెక్ట్‌లో శివ కార్తికేయన్ పేరు బలంగా వినిపించింది. ఆయన అల్లు అర్జున్ కాంబో తమిళనాట బాగా క్రేజ్ తెచ్చిపెడుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ ప్రస్తుతం అట్లీ దుబాయ్‌లో ఉండి తన స్క్రిప్ట్ పనులు ముగించడానికి కృషి చేస్తున్నాడట. దీంతో కొత్త అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది పూర్తిగా కొత్త కథా లేక అట్లీ గతంలో సిద్ధం చేసుకున్న కథేనా అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు. కానీ ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్‌పై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతే అసలు నిజం తెలియనుంది.