పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి 45 ఇయర్స్. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ప్రభాస్. ప్రభాస్ పెళ్లి అంటూ గత పదేళ్లుగా ప్రచారం జరగడమే కానీ, ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాను అనే ఊసు ఎక్కడా వినిపించలేదు. అనుష్క-ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని వార్తలు రావడం, వాటిని వాళ్ళు ఖండించడం చూసాం.
తాజాగా ప్రభాస్ పెళ్లి హైదరాబాద్ కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె తో నిశ్చయమైంది, ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు గారి భార్య ప్రభాస్ పెళ్లి పనులు సీక్రెట్ గా చూసుకుంటున్నారనే వార్త ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యింది.
అయితే ప్రభాస్ పెళ్లి బిజినెస్ మ్యాన్ కుమార్తె తో అన్న వార్తలపై ప్రబాస్ టీమ్ స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు, ఇలాంటి పుకార్లను నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది.