హిందీలో యానిమల్ తో బిగ్ హిట్ కొట్టిన రష్మిక మందన్న ఆ చిత్రంతో నార్త్ తో తన క్రేజ్ పెంచుకుంది. యానిమల్ లో బోల్డ్ యాక్టింగ్ తో రష్మిక అద్దరగొట్టేసింది. యానిమల్ తర్వాత పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టిన రష్మిక నటించిన ఈ చిత్రం సౌత్ చిత్రం కావడంతో అది నార్త్ ఖాతాలో పడలేదు. పుష్ప 2 నార్త్ లో దాదాపుగా 1000 కోట్లు కొల్లగొట్టింది.
ఆ తర్వాత రష్మిక నుంచి వచ్చిన మరో హిందీ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే ఛావా. విక్కీ కౌశల్-రష్మిక జంటగా ఫిబ్రవరి 14 న థియేటర్స్ లో విడుదలైన ఛావా చిత్రం రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఈచిత్రంలోను రష్మిక నటనపై ప్రశంశల వర్షం కురిసింది. ఛావా బ్లాక్ బస్టర్ అయ్యాక రష్మిక రేంజ్ పెరిగింది.
అలా హిందీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రష్మిక మందన్న ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 30 రంజాన్ స్పెషల్ గా సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సికిందర్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. రష్మిక ఈ చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటుందా, నార్త్ లో రష్మిక హ్యాట్రిక్ కొడితే ఆమె రేంజ్ మరింతగా పెరిగిపోతుంది.