చియాన్ విక్రమ్ వీర ధీర శూర నేడు రిలీజ్ అంటూ ప్రకటించారు. వీలున్నంత ప్రమోషన్స్ చేసారు. థియేటర్స్ కొన్ని ఫిక్స్ అయ్యాయి. ఆడియన్స్ లుక్స్ అటు వైపు వెళ్లాయి. కానీ షో మాత్రం పడలేదు. సినిమా మాత్రమ్ స్క్రీన్ పైకి రాలేదు.
కారణాలేంటి అని పరిశీలిస్తే ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్ ఏదో ఉందట. అందుకు సంబందించిన అగ్రిమెంట్ కూడా స్ట్రాంగ్ గానే ఉందట. ఈ కేసు కోర్టు దాకా వెళ్లిందట. ఢిల్లీ హై కోర్ట్ ఈ సినిమా విడుదలపై ఆజ్ఞలు జారీ చేసిందట. మరో నాలుగు వారాల పాటు వీర ధీర శూర విక్రమ్ కోసం వేచి చూడాలి అభిమానులు అనేది ప్రస్తుతానికి తెలుస్తోన్న రిపోర్ట్.
తమిళనాడులోనే కాక ఇతర రాష్ట్రల్లో, ఓవర్సీస్ లో ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న అభిమానులకు ఆ టికెట్ ప్రైస్ రిటన్ చేసేస్తున్నాయి ఆయా బుకింగ్ సంస్థలు. వీర ధీర శూర పార్ట్ 2 ముందు రిలీజ్ చేసి ఆపై పార్ట్ 1 చూపిస్తామంటూ విచిత్రమైన ప్రకటన చేసిన మేకర్స్ కి ఇప్పుడున్న పరిస్థితులు పార్ట్ 1 చూపించేస్తున్నాయి.
ఇప్పటికే విక్రమ్ నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధ్రువ నక్షత్రం విడుదలకి ఏళ్ల తరబడి తంటాలు పడుతుంది. ఇప్పుడు ఈ కోవలో ఈ చిత్రం చేరింది. PS 1, 2 సినిమాల సక్సెస్ తర్వాత తంగలాన్ తో మళ్ళి పూర్తిగా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడనుకున్న విక్రమ్ కి ఇది విషమ పరీక్షే.