సౌత్ సినిమాలని పక్కనపెట్టి ముంబైలోనే సెటిల్ అయ్యేలా కనబడుతున్న సమంత ప్రస్తుతం శ్రీలంక వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది. హిందీ వెబ్ సీరీస్ షూటింగ్స్ తో పాటుగా సినిమాలను నిర్మిస్తున్న సమంత ఎక్కువగా ముంబైలో దర్శనమిస్తుంది. సౌత్ సినిమాల్లో సమంత కి ఆఫర్స్ అని ప్రచారం జరుగుతున్నా అవేమి పట్టాలెక్కేలా లేవు.
రీసెంట్ టైమ్స్ లో రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే RC 17 లో సమంత ను హీరోయిన్ గా సంప్రదిస్తున్నారని అన్నా అది కూడా రూమర్ మాదిరే కనిపిస్తుంది. మరోపక్క సౌత్ ఆడియన్స్ సమంత ఆమె అభిమానులను కంగారు పెడుతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత శ్రీలంక వెకేషన్ లుక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
జీబ్రా డ్రెస్ తో సమంత మోడ్రెన్ గా బ్యూటీఫుల్ అనే కన్నా చాలా కాన్ఫిడెంట్ గా కూల్ గా కనిపించింది అనొచ్చు.