పవన్ కళ్యాణ్ తాను పూర్తి చెయ్యాల్సిన సినిమాలు ఎప్పటికి పూర్తి చేస్తారు, ఇప్పటికే వీరమల్లు పదే పదే వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక OG ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో మేకర్స్ కి తెలియడం లేదు, మరోపక్క హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయింది అనే వార్తలు.
ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ ను నిలువనీయడం లేదు, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఫైట్ చేసే హరీష్ శంకర్ కూడా కొద్దిరోజులుగా అంటే మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సడన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇచ్చిన అప్ డేట్ ఒక్కసారిగా వైరల్ అయ్యిది.
పవన్ కళ్యాణ్ తో సినిమా వస్తుంది అంటే ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోదు, హరీష్ శంకర్ స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు, 2026 లో ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తున్నాం, కొడుతున్నాం అంటూ మైత్రి రవి ఉస్తాద్ భగత్ సింగ్ పై రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో ఇచ్చిన అప్ డేట్ నెట్టింట సంచలనంగా మారింది.