గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు పీక్స్ లో మొదలయ్యాయి, మెగా అభిమానులు తమ హీరో చరణ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ హంగామా చెయ్యడమే కాదు కేక్ కట్ చేస్తూ.. రామ్ చరణ్ బ్యానర్లకు పూజలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈలోపులో నిన్నటివరకు సస్పెన్స్ క్రియేట్ చేసిన RC16 మేకర్స్ RC16 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ కు కావల్సిన ట్రీట్ అందించారు.
మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే కి బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 16 నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని సిద్ధం చేసారు మేకర్స్. రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ముందు నుంచి ప్రచారంలో ఉన్న RC 16 టైటిల్ గా పెద్ది ని రివీల్ చెయ్యడమే కాదు రామ్ చరణ్ రగడ్ లుక్ ని ఫస్ట్ లుక్ గా ఇంట్రడ్యూస్ చేసారు. అంతేకాదు మరో సైడ్ లుక్ ని కూడా చరణ్ బర్త్ డే సందర్భంగా వదిలారు మేకర్స్
రామ్ చరణ్ పెద్ది లుక్ చూసి మెగా అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. నోటిలో సిగార్ తో రామ్ చరణ్ రఫ్ అండ్ రగడ లుక్ మాత్రం అభిమానులుతో విజిల్స్ వేయించేదిలా ఉంది.