మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన లూసిఫర్ గతంలో ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచిందో అందరికి తెలిసిందే. అదే చిత్రాన్నిమెగాస్టార్ తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. మలయాళ వెర్షన్ లూసిఫర్ ఓటీటీ లోను సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే లూసిఫర్ కి సీక్వెల్ గా L2: ఎంపురాన్ తెరకెక్కించారు హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్.
పాన్ ఇండియాలోని పలు భాషల్లో భారీగా ప్రమోట్ చేసి మరీ మార్చ్ 27 న వరల్డ్ వైడ్ గా L2: ఎంపురాన్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే పలుచోట్ల L2: ఎంపురాన్ ప్రీమియర్స్ పూర్తి కావడంతో ఆడియన్స్ తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
L2: ఎంపురాన్ వీక్షించిన ఓ మూవీ లవర్.. ఫస్టాఫ్ చాలా యావరేజ్‌గా ఉంది. సెకండాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది.. అంటూ ట్వీట్ చేసాడు. మరో నెటిజెన్ ఇద్దరు మోహన్ లాల్‌లు స్క్రీన్ మీద కలుసుకోవడం స్క్రీన్ బద్దలైందా అనిపిస్తుంది. చివరి 20 నిమిషాల్లో స్టీఫెన్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయడం పీక్స్‌లో ఉంది. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ల డెప్త్ బాగుంది. సెకండాఫ్‌లో కథ కోసం వేసిన స్క్రీన్ ప్లే ఆసక్తిని పెంచింది.. అంటూ ట్వీట్ చేసాడు.
ఫస్ట్ హాఫ్ ఓకె ఓకె కానీ బోర్ కొట్టదు, సెకండ్ హాఫ్ సినిమాని నిలబెడుతుంది, సినిమా ఫుల్లు రిచ్‌గా ఉంది. బీజీఎం, డైరెక్షన్, సినిమాటోగ్రఫి అదిరిపోయాయి అంటూ మరో నెటిజెన్ స్పందించాడు. ప్రీమియర్ టాక్ చూసాక అందరికి L2: ఎంపురాన్ రివ్యూ ఎప్పుడెప్పుడు చదివేద్దామా అనే ఆత్రుత స్టార్ట్ అవడం గ్యారెంటీ.. మరి L2: ఎంపురాన్ రివ్యూ కోసం కాస్తా వెయిట్ చేస్తే సరి.