రీసెంట్ గా మోహన్ లాల్ శబరి మలై ఆలయంలో ప్రత్యేకంగా చేయించిన ఉష పూజ అందరికి తెలిసిందే. అక్కడ తన స్నేహతుడు మమ్ముట్టి అసలు పేరు మొహ్మద్ కుట్టి అంటూ ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ పేర్ల పై పూజలు చేయించడం వివాదస్పదం అయ్యింది. ఆ లోపే మమ్ముట్టి కి క్యాన్సర్ కాబట్టే మోహన్ లాల్ ప్రత్యేకంగా పూజలు చేయించారని అనుకున్నారు.
తాజాగా మోహన్ లాల్ శబరిమలై పూజలు పై క్లారిటీ ఇచ్చారు. తన స్నేహితుడు, ఆయన ఇంటి వారిపై పూజలు చేయించడం తప్పేలా అవుతుంది. నేను ప్రత్యేకంగా మమ్ముట్టి పేరుపై పూజలు చేయించిన విషయం అక్కడి పూజారులు చెబితే తప్ప తెలియదు, మమ్ముట్టికి ఎలాంటి అనారోగ్యం లేదు, ఈమధ్యన కాస్త సిక్ అయ్యి మళ్ళీ కోలుకున్నారు.
అలాంటి అనారోగ్యాలు అందరికి వస్తుంటాయి. ప్రస్తుతం రంజాన్ నెల కావడంతో ఆయన ఉపవాస దీక్షలో ఉన్నారు, ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు, త్వరలోనే ఆయన మీ ముందుకు వస్తారంటూ మోహన్ లాల్ లూసిఫర్ 2 ప్రమోషన్స్ లో చెప్పారు.