మార్చ్ 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. అంటే చరణ్ బర్త్ డే కి మరికొన్ని గంటల సమయమే ఉంది. మెగా అభిమానులు రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ కోసం వెయిటింగ్, అంతేకాదు బ్యానర్లు కట్టి పండగ చేసుకుంటూ కేక్ యాక్ట్ చేసి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు,
మరోపక్క రామ్ చరణ్ లేటెస్ట్ క్రేజీ పాన్ ఇండియ ఫిల్మ్ RC 16 నుంచి రాబోయే ట్రీట్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కూర్చున్నారు. మరి రామ్ చరణ్ బర్త్ డే కి దర్శకుడు బుచ్చిబాబు RC 16 నుంచి రామ్ చరణ్ కేరెక్టర్ గ్లింప్స్ వదులుతారని ప్రచారం ఉంది. మరోపక్క రెహమాన్ ఆర్ ఆర్ పై అనుమానాలు.
ఇలాంటి సమయంలో అసలు RC 16 నుంచి అప్ డేట్ ఉంటుందా అనే డౌట్ కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే కి సమయం దగ్గరకొచ్చేసింది. RC 16 నుంచి ఇంతవరకు మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దానితో మెగా ఫ్యాన్స్ లో అసహనం మొదలైంది. బుచ్చిబాబు ఏమిటి వెయిటింగ్ అంటూ వారు బుచ్చిబాబు ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.