నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలతో నాగవంశీ నిర్మించిన మ్యాడ్ చిత్రంతో చాలా సింపుల్ గా భారీ హిట్ కొట్టేసారు. మ్యాడ్ చిత్రం మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ కామెడీతో నడిచింది. రామ్ నితిన్-సంగీత్ శోభన్ లు పోటి పడి కామెడీ చేసారు. ఆ చిత్రం సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరక్కెక్కించారు.
రేపు శుక్రవారం అంటే మార్చ్ 28 న విడుదలకాబోతున్న మ్యాడ్ స్క్వేర్ చిత్ర ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం AMB మాల్ లో విడుదల చేసింది చిత్ర బృందం. మ్యాడ్ చిత్రాన్ని కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తే, మ్యాడ్ స్క్వేర్ మాత్రం లడ్డు గాని పెళ్లి పేరుతో గోవా చుట్టూ తిప్పారు. మ్యాడ్ స్క్వేర్ లో ఎంటెర్టైఎమెంట్ కూడా డబుల్ డోస్ లో కనిపించింది.
కామెడీ డైలాగ్స్, BGM, నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల హిలేరియస్ కామెడీ, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్ అన్ని మ్యాడ్ స్క్వేర్ కి ప్లస్ అయ్యాయి. మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూసాక మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రానున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ని చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవ్వాల్సిందే.