టీడీపీ అభిమానుల్లో, యూత్ లో, కార్యకర్తల్లో ప్రస్తుతం తీవ్ర అసహనం నడుస్తుంది. టీడీపీ నేతల పై, లోకేష్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో లోకేష్ ఎలా చెయ్యి కలిపారు అంటూ టీడీపీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఐటీ సంస్థ సిస్కో, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది.
దీని ద్వారా ఏపీలోని లక్షమంది యువతకు వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా మినిస్టర్ నారా లోకేష్‌తో ఐటీ సంస్థ సిస్కో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. అంతేకాకుండా లోకేష్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ భేటీలో వీరిలో సిస్కో సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ అకౌంట్ మేనేజర్ హోదాలో గతంలో నారా లోకేష్ ఇతర టీడీపీ నేతలపై అనవసర విమర్శలు చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డి కూడా ఉండడం హాట్ టాపిక్ అయ్యింది.
టీడీపీని, టీడీపీ నేతలను, ముఖ్యంగా యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ ను అంతలా తిట్టి విమర్శించిన రవీంద్రారెడ్డి ని లోకేష్ ఎలా కలిశారు, లోకేష్ కి కనీసం ఆయన విషయం ఎవరూ చెప్పలేదా, లోకేష్ దగ్గర పనిచేసే అధికారులు ఈ విషయం లోకేష్ దగ్గరకు చేరకుండా చేసారా, అసలు లోకేష్ అన్న అలాఎలా రవీంద్రారెడ్డిని కలిసి షేక్ హ్యాండ్ ఇస్తారు అంటూ టీడీపీ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
ప్రస్తుతం రవీంద్రారెడ్డి కి లోకేష్ షేక్ హ్యాండ్ ఇస్తున్న పిక్స్ తో ఛానల్స్ లోను డిబేట్ నడవడం, ఇదంతా వైరల్ అవడంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.