నేడు మార్చ్ 26 యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి బర్త్ డే. 2011 లో ప్రణతి ని వివాహం చేసుకున్న ఎన్టీఆర్ మార్చ్ 26 ఆమె బర్త్ డే కి ప్రేమగా ట్రీట్ ఇవ్వడమే కాదు స్పెషల్ గా విష్ కూడా చేస్తారు. ఈసారి అది జపాన్ లో జరిగింది. గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ జపాన్ లో దేవర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు.
దేవర చిత్రం జపాన్ లో మార్చ్ 28 న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ భార్య ప్రణతితో సహా జపాన్ వెళ్లారు. అక్కడే గత రాత్రి ప్రణతి బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. అంతేకాదు భార్య ప్రణతితో బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసిన పిక్స్ వదులుతూ అమ్ములు.. హ్యాపీ బర్త్ డే అంటూ క్యూట్ గా క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇక ఎన్టీఆర్ మార్చ్ 28 న జపాన్ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారు. రాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం బెంగుళూరు బయలుదేరి వెళతారు, మార్చ్ 29 నుంచి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.