వైసీపీ మాజీ ఎమ్యెల్యే, గుడివాడ కింగ్ కొడాలి నాని ఈరోజు ఉదయం గుండెపోటు తో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన గ్యాస్ట్రిక్ పెయిన్ అంటూ ఆసుపత్రికి వెళ్లిన కొడాలి నాని కి అన్ని టెస్ట్ లు నిర్వహించి అది గ్యాస్ట్రిక్ పెయిన్ కాదు గుండెపోటు అని వైద్యులు నిర్దారించి వైద్యం స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
కొడాలి నాని గతంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ప్రస్తుతం గుండె సమస్య కారణంగా ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందా, లేక గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వచ్చిందా అనే దానిపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొడాలి నాని ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే కొడాలి అభిమానులు, వైసీపీ శ్రేణులు, ఆందోళనకు గురయ్యారు.