బాలీవుడ్ లో ఫిబ్రవరి14 న విడుదలైన విక్కీ కౌశల్, రష్మిక మందన్న ల ఛావా చిత్రం నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా ఎలాంటి అంచనాలు లేకుండానే థియేటర్స్ లో దాదాపుగా 700కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.
హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఛావా చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో డబ్ చేసి విడుదల చెయ్యగా.. మిగతా భాషల్లోనూ ఛావా మంచి హిట్ అయ్యింది. ఇప్పటికి థియేటర్స్ లో కలెక్షన్స్ తీసుకొస్తున్న ఛావా చిత్రం థియేటర్స్ లో విడుదలై అప్పుడే 40 రోజులైంది. కానీ ఇప్పటికి ఓటీటీ డేట్ పై క్లారిటి లేదు.
ఛావా ఓటీటీ హక్కులను అన్ని భాషలకు కలిపి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంత చేసుకుంది. తాజాగా ఛావా ఓటీటీ పై ఓ న్యూస్ వైరల్ అయ్యింది. అది ఛావా థియేటర్స్ లో విడుదలైన 60 రోజులకు అంటే ఏప్రిల్ 11 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.