రామ్ చరణ్ బర్త్ డే వచ్చేస్తోంది. మార్చ్ 27 గురువారమే చరణ్ బర్త్ డే. చరణ్ బర్త్ డే కి ఆయన నుంచి మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ అందబోతుంది. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న RC 16 నుంచి దర్శకుడు బుచ్చి బాబు మెగా అభిమానుల కోసం ఏ సర్ ప్రైజ్ ప్లాన్ చేసాడు. ఇప్పటివరకు రామ్ చరణ్ బర్త్ డే కి ఇవ్వబోతున్న RC 16 అప్ డేట్ ఏమిటో తెలియడం లేదు.
తాజాగా రామ్ చరణ్ బర్త్ డే కి RC 16 నుంచి రామ్ చరణ్ కేరెక్టర్ గ్లింప్స్ వదిలెందుకు రంగం సిద్దమైనదట. ఇప్పటికే హైదరాబాద్ లో RC 16 నైట్ షూట్స్ ముగియగా ఇప్పుడు RC 16 టీమ్ మొత్తం గ్లింప్స్ రెడీ చెసే పనిలో ఉందట. ఈ గ్లింప్స్ లో రామ్ చరణ్ కేరెక్టర్ ఎలా ఉండబోతుందో అనేది రివీలవ్వుద్ది అంటున్నారు.
అయితే RC 16 గ్లింప్స్ లో రెహమాన్ ఆర్.ఆర్ పై సందిగ్దత నడుస్తుంది. కారణం రీసెంట్ గానే రెహమాన్ ఆసుపత్రికి వెళ్లొచ్చారు. గ్లింప్స్ కట్ అయితే రెడీ కానీ.. అందులో ఆర్ ఆర్ పై అనుమానమంటున్నారు. మరి మెగా అభిమానులు RC 16 గ్లింప్స్ తో సంబరాలు చేసుకోవడం ఖాయమన్నప్పటికి ఈ చిన్న చిన్న అనుమానాలు ఆందోళన పడేలా చేస్తున్నాయని వారు వాపోతున్నారు.