కోలీవుడ్ స్టార్ హీరో దర్శకత్వంలో తెరకెక్కిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం సినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. అయితే తెలుగు వర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా తెలుగు డిజిటల్ రైట్స్‌ను సింప్లీ సౌత్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ స్ట్రీమింగ్ ప్రారంభమైన తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులు దీని ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండటంతో తెలుగు వర్షన్ కూడా త్వరలో అదే వేదికపై విడుదలవుతుందని సినీ ప్రేమికులు ఊహించారు. కానీ సింప్లీ సౌత్ ఓటీటీ సంస్థ హక్కులను కొనుగోలు చేయడంతో తెలుగు వెర్షన్ అమెజాన్ లేదా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సింప్లీ సౌత్ ఓటీటీ ఇండియాలో అందుబాటులో లేదు. అంటే భారతదేశంలోని ప్రేక్షకులు ఈ సినిమాను ఆ వేదికలో చూడలేరు. అయితే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అక్కడ సింప్లీ సౌత్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కొంత కాలం తర్వాత అమెజాన్ ప్రైమ్ లేదా ఆహాలో కూడా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.