నటుడు సోను సూద్ భార్య సోనాలి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోను సూద్ భార్య సోనాలి ఆమె సోదరి సుమితా సాల్వే ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ముంబై-నాగ్‌పూర్ హైవేపై సోనూ సూద్ భార్య సోనాలి, ఆమె సోదరి ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
సోనాలి, సుమిత ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనాలి, సుమితా నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో సోనాలి మేనల్లుడు కారు నడుపుతున్నట్టు తెలిసింది. అతనికి కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది.