ఎన్టీఆర్ ఎంత పెద్ద ఫ్యూడి నో అంతకు మించి చెయ్యి తిరిగిన వంటగాడు, ఆయన బిగ్ బాస్ లో చేసిన మటన్ బిర్యాని అందరూ చూస్తే, ఆయన వంట గురించి కళ్యాణ్ రామ్ పలు సందర్భాల్లో చెప్పారు, నాన్న(జూనియర్ ఎన్టీఆర్) చాలా బాగా వంట చేస్తాడు, ఏం తొయ్యకపోయినా ,టెన్షన్ లో ఉన్నా బిర్యానీ, ఇంకా వెజ్ అన్ని చాల బాగా వండుతాడని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంట గురించి చెప్పారు.
తాజాగా ఎన్టీఆర్ బావమరిది, లక్ష్మి ప్రణతి తమ్ముడు మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ ఎన్టీఆర్ వంట గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసాడు. నార్నె నితిన్ మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ ఎన్టీఆర్ వంట గురించి అడిగితే దమ్ బిర్యానీ బాగా చేస్తాడు, హలీం అయితే ఇంకా సూపర్బ్ గా వండుతాడు. అక్క ప్రణతి కోసం బావ స్పెషల్ గా వండుతారని చెప్పాడు.
రీసెంట్ గా అక్కకు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే అక్క ఇన్స్టాలో చూసి ఏదో కారం గురించి చెబితే బావ వెంటనే ఆ వెల్లులి కారాన్ని అక్క కోసం రెడీ చేసాడు, అక్కని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు, ఇన్స్టా లో ఏది చూసినా బావ వండేస్తాడు అంటూ ఎన్టీఆర్ వంట పై నార్నె నితిన్ క్రేజీ కామెంట్స్ చేసాడు.