టీడీపీ ఆఫీస్ ఉద్యోగి సత్యమూర్తి కిడ్నాప్ కేసులోనూ, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ ప్రస్తుతం పోలిసుల అదుపులో ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్స్ అనేకసార్లు రిజెక్ట్ అవుతుంది. ప్రస్తుతం విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇంతకుముందు వంశీ కి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా, అది నేటితో ముగిసింది. దానితో వంశీని పోలీసులు మరోసారి న్యాయస్థానంలో హాజరుపరిచారు. వల్లభనేని వంశీకి బెయిల్ రాకపోగా వచ్చే నెల అంటే ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది.