యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మరో రెండు రోజుల్లో అంటే ఈ శుక్రవారం ఉగాది స్పెషల్ గా మ్యాడ్ స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిర్మాత నాగవంశీ బ్యానర్ నుంచి రాబోతున్న మ్యాడ్ స్వేర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే నార్నె నితిన్ మొదటి సినిమా మ్యాడ్ మూవీ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ సపోర్ట్ ఉంది. అంటే మ్యాడ్ ట్రైలర్ లాంచ్ చేసి ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ క్రియేట్ చేసారు.
కానీ ఈసారి మ్యాడ్ స్క్వేర్ కి ఎన్టీఆర్ సపోర్ట్ లేదు, మరి సినిమా విడుదల సమయానికి ఎన్టీఆర్ ఏమైనా ఓ వీడియో తో మ్యాడ్ స్క్వేర్ ని ప్రమోట్ చేస్తారేమో చూడాలి, కానీ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ఏదో ఒక విషయంలో ప్రమోట్ చేస్తే సినిమాకి ఖచ్చితంగా ఇంకాస్త హెల్ప్ అయ్యేది.
కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన దేవర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆయన జపాన్ నుంచి వచ్చేసరికి మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అవుతుంది. మరి మ్యాడ్ స్క్వేర్ నిర్మాత నాగవంశీకి కూడా ఎన్టీఆర్ బాగా కావాల్సిన వాడే. కానీ మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ ని వాడుకోలేకపోయారు వీరు.