బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో 25 మంచి పై కేసు నమోదు కాగా అందులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో యాంకర్ శ్యామల తెలంగాణ హై కోర్టుకి వెళ్లి క్వాష్ పిటిషన్ వేసింది, తనని అరెస్ట్ చెయ్యకుండా చూడాలని కోర్టుని వేడుకోగా.. శ్యామల ను పోలీసులు అరెస్ట్ చేయకూడదు, కానీ ఆమె పోలీసులకు సహకరిస్తూ విచారణకు హాజరవ్వాలని తీరునిచ్చింది.
సోమవారం శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం హాజరైంది. తాజాగా విష్ణుప్రియ కూడా తెలంగాణ హై కోర్టుకెళ్లి తన కేసుని క్వాష్ చెయ్యాలని పిటిషన్ వేసింది. తనపై పెట్టిన రెండు కేసులను కొట్టి వెయ్యాలని కోర్టులో పిటిషన్ వేసింది. ఈరోజు మరోసారి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరవ్వాల్సి ఉంది.
ఈలోపు విష్ణుప్రియ హై కోర్టుకి వెళ్ళింది. ఈరోజు కోర్టులో విష్ణు ప్రియ కేసు విచారణకు రానుంది.